మైనర్‌ బాలికల హత్య కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో వెల్లడైన సంచలన నిజాలు

|

Feb 20, 2021 | 4:39 PM

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై విష ప్రయోగం కేసును పోలీసలు ఛేదించారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మైనర్‌ బాలికల హత్య కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో వెల్లడైన సంచలన నిజాలు
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై విష ప్రయోగం కేసును పోలీసలు ఛేదించారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఉన్నావ్‌ జిల్లాలో ముగ్గురు మైనర్‌, దళిత బాలికలపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు ప్రాణాలను కోల్పోగా, మరొకరు కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఈ బాలిక కాన్పూర్‌ ఆస్ప్రతిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు వినయ్‌ అలియాస్‌ లంబుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో నిందితుడు వినయ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌ సయమంలో ఈ ముగ్గురు బాలికలతో వినయ్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు.. కబుర్లు చెప్పుకునే వారు. ఇదే క్రమంలో వినయ్‌ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న వినయ్‌ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడని పోలీసలు తెలిపారు.

ఇదే క్రమంలో వినయ్‌ బాలికను హతమార్చేందుకు పక్కా ఫ్లాన్ చేశాడు. తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్‌ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌ తీసుకుని బాధిత మైనర్‌ బాలికల దగ్గరకు వెళ్లాడు వినయ్. రోజులానే నిందితుడు వినయ్‌, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్‌ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ, దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పిపడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్‌, అతడి స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు వివరించారు. దీంతో ముగ్గురు బాలికను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ఇద్దరు బాలికలు మ‌‌ృత్యువాతపడగా, ఒకరు కొన ఉపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో దొరికిన సిగరేట్‌ పీక, వాటర్‌ బాటిల్‌ ఆధారంగా కేసును ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది వినయ్‌ పాత్ర అని నిర్థారణకు వచ్చారు. దీంతో పోలీసులు కాల్‌ డీటెయిల్‌ రికార్డ్‌ టెక్నిక్‌ ఆధారంగా వినయ్‌ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక, తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండిః దేశ చరిత్రలో తొలిసారిగా మహిళకు ఉరి శిక్ష.. తల్లికి క్షమాభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్న బాలుడు