హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌కుమార్‌ మర్డర్‌ కలకలం.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

|

Aug 07, 2021 | 1:16 PM

హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌కుమార్‌ మర్డర్‌ కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌కుమార్‌ మర్డర్‌ కలకలం.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు
Nellore Realter Kidnap And Murder
Follow us on

Nellore Realter Kidnap and Murder: హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌భాస్కర్ రెడ్డి మర్డర్‌ కలకలం రేపుతోంది. హాస్టల్‌ నుంచి అదృశ్యమయ్యాడంటూ నమోదైన ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడి హత్య వెనక ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విదేశాల నుంచి భారీగా సొమ్ములొస్తున్నాయని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టిన మోసం వెలుగు చూస్తోంది.

అతనో ఆధ్యాత్మిక గురువు… అయితే, భక్తులకు ప్రవచనాలతోపాటు రోగాలను కూడా నయం చేస్తానంటూ నమ్మించేవాడు. పైగా తన దగ్గర అద్భుత శక్తులు కలిగిన లోహాలు ఉన్నాయంటూ భక్తులను బుట్టలో వేసుకున్నాడు. ఆ స్వామీజీ మాటలను నమ్మిన ఎంతోమంది తమ దగ్గరున్న సొమ్మంతా సమర్పించుకున్నారు. అలాగే, తన దగ్గరకు వచ్చే భక్తుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. ఏపీ, తెలంగాణతోపాటు కర్నాటక, మహారాష్ట్రలో ఆశ్రమాలు తెరిచిన ఈ గురూజీకి భక్తి చాటున ఎన్నో ఘోరాలు, నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఓ రియల్టర్ మర్డర్ తో ఈ స్వామీజీ నేర చరిత్ర మొత్తం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో కనిపించకుండా పోయిన రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, విజయ్ భాస్కర్ ను పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి మర్డర్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి మర్డర్‌కు ఓ గురూజీయే ప్రధాన సూత్రధారని గుర్తించారు. మర్డర్ కారణాలపై ఆరా తీసిన పోలీసులకు మరింత అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. కేవలం తనను అప్రతిష్టపాలు చేస్తున్నాడనే కారణంతోనే రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈ గురూజీ…. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నిజాంపేట్‌లో మకాం వేసేవాడు. అయితే, తన దగ్గర అత్యంత విలువైన లోహం ఉందని.. దీన్ని విదేశీ సంస్థలకు విక్రయిస్తే ఎవ్వరూ ఊహించని డబ్బు వస్తుందంటూ నమ్మించేవాడు. ఆ సాకుతోనే భక్తుల నుంచి కోట్లాడి రూపాయలు తీసుకునేవాడు. ఇదే క్రమంలో రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి కూడా గురూజీ మాటలు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించుకున్నాడు. అయితే, విదేశాల నుంచి నిధులు రాకపోవడంతో తన డబ్బు తిరిగివ్వాలంటూ గురూజీపై విజయ్‌భాస్కర్ ఒత్తిడి పెంచాడు. అంతేకాదు, గురూజీ అక్రమాల భాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, తనను అప్రతిష్టపాలు చేస్తున్నాడంటూ కక్ష పెంచుకున్న గురూజీ…. తన అనుచరులతో ప్లాన్ చేసి… సినీ స్టైల్లో చంపేశాడు.

ఎట్టకేలకు విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విజయభాస్కర్‌రెడ్డి.. గత నెల 20 నుంచి అందుబాటులో లేకుండాపోయాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో అనుమానం వచ్చిన ఆయన కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మల్లేశ్‌, సుధాకర్‌, కృష్టంరాజుతోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. విజయ్‌భాస్కర్‌ రెడ్డిని హత్య చేసి నిందితులు హైదరాబాద్ నుంచి శ్రీశైలందారిలోని సున్నిపెంటకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సున్నిపెంట శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also…  Suicide: సూర్యాపేట జిల్లాలో బావ- మరదలు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోతో వెలుగులోకి అసలు నిజాలు..!