చెయ్యికి చెయ్యి, తలకి తల. పగకి పగ.. ఇది సినిమా డైలాగ్ అనుకుంటున్నారా? కానే కాదు.. రీల్ సీన్ కాదు, ఇది రియల్ సీన్. కోడల్ని చంపారనే ఆరోపణలు మీద జైల్ కి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన అంజనమ్మ, వరలక్ష్మి అనే తల్లి కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలంలోని డి నేలటూరు గ్రామంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ డబల్ మర్డర్ చేసింది ఎవరు? హత్య కి గల కారణాలు ఏంటి? అనే విషయాలపై చేసిన విచారణంలో ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కట్నకానుకులపై దురాశ కక్ష్యలకు ఆజ్యం పోసింది. వరకట్నం కోసం నాడు కోడలిని బలితీసుకుంటే.. ఆదే ప్రతికారం నేడు అత్తను, వారి బిడ్డను బలితీసుకుంది. ఓ దురాశ ముగ్గరి హత్యలకు దారి తీసిన నేపథ్య ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి. నేలటూరు పురుడుపోసుకుంది. కోడలిని చంపిన ప్రాంతంలో వరకట్నం ఇలా ప్రతీకార స్వేచ్చను రగిలించి దారుణహత్యలకు దారి తీసింది.
బ్రహ్మంగారి మఠం లోని డి.నేలటూరులో ఇటీవల డబల్ మర్డర్లు జరిగాయి. తల్లికూతుళ్లు అంజనమ్మ, లక్ష్మిదేవిలు దారుణ హత్యకు గురయ్యారు. వీరిది డి.నేలటూరు స్వగ్రామం. అంజనమ్మ తనయుడు తన ఇంటి పక్కన గల రామాంజనేయుల రాజు కుమార్తె చరీష్మను పెండ్లి చేసుకున్నాడు. తర్వాత కట్నం విషయమై చరీష్మను.. అత్త అంజనమ్మ, భర్త వెంకటేశ్వరరాజు, ఆడబిడ్డ వరలక్ష్మిమ్మలు 2019 మే నెలలో హత్య చేశారు. హత్య తర్వాత అంజనమ్మ, కూతురు వరలక్ష్మిమ్మ, కొడుకు వెంకటేశ్వరరాజులుపై కేసు నమోదైంది. జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సొంతూరు వెళ్తే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించి.. బ్రహ్మంగారి మఠంలోనే ఉండిపోయారు. చరీష్మా కేసును రాజీ చేద్దామని కొందరు పెద్ద మనుషులు జోక్యం మేరకు తల్లీకూతుర్లు డి.నేలటూరులోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఇది పసిగట్టిన చరీష్మా తండ్రి రామాంజనేయులు రాజు, ఆయన సోదరుడు శ్రీనివాసులు రాజు కలిసి అంజనమ్మను, ఆమె కుమార్తెను దారుణంగా చంపి ప్రతీకారం తీర్చుకున్నారు. మహిళల డబుల్ మర్డర్ కేసులో నిందితులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడబాగ్ని రామాంజనేయ రాజు, బడబాగ్ని శ్రీనివాస రాజు, పేర్ని వెంకట వరప్రసాద్ రాజు, బడబాగ్ని బ్రహ్మ నారాయణమ్మలను తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Also Read: సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌తో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు