Chittoor District: 8 ఏళ్ల బాలుడి హత్య కేసులో సంచలన నిజాలు.. లైంగిక దాడి, ఆపై హత్య

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి మర్డర్‌ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. కేసు విచారణ చేసిన పోలీసులు అసలు నిజాలు తెలిసి కంగుతిన్నారు.

Chittoor District: 8 ఏళ్ల బాలుడి హత్య కేసులో సంచలన నిజాలు.. లైంగిక దాడి, ఆపై హత్య
Breaking.2

Updated on: Oct 25, 2021 | 7:02 PM

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి మర్డర్‌ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. బాలుడిపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశారన్న షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కేసును విచారణ చేసిన పోలీసులు విషయం తెలుసుకొని షాక్‌కు గురవుతున్నారు. గ్రామస్తులు కూడా ఈ విషయం తెలిసి స్టన్ అయ్యారు.  నందకుమార్‌రెడ్డి అనే వ్యక్తి బాలుడిపై లైంగిక దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తేల్చారు. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం ఎగువ మేకలవారి పల్లిలో ఈ నెల 12న ఓ బాలుడు దారుణ హత్యకు గుయ్యాడు. అయితే.. ఘటనలో ఆస్తి, అప్పుల తగాదాలకు సంబంధించిన ప్రత్యర్థుల ప్రమేయం ఉంటుందని పోలీసులు భావించారు. అయితే.. ఆ కోణంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. స్పాట్‌లో దొరికిన ఆధారాల అధారంగా గ్రామానికి చెందిన నంద కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటకు కక్కాడు.

8 ఏళ్ల బాలుడిని లైంగికంగా చిత్రహింసలకు గురిచేశాడు ఎగువ మేకలవారిపల్లె చెందిన నందకుమార్ రెడ్డి. లైంగిక దాడి విషయం ఎవరికైనా చెపుతాడానే భయంతోనే తేజేష్ ను నంద కుమార్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నందకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Also Read: Pattabhi: ఎయిర్‌పోర్ట్‌లో పట్టాభి.. ఎక్కడికి వెళ్లారంటే

Shami: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్

Loading...
Unable to load recommendations.
Follow Us