ఇక మాటల్లేవ్.. లొంగిపోండి..శరవణ భవన్‌ యజమానికి సుప్రీం అల్టిమేటం

| Edited By: Srinu

Jul 10, 2019 | 5:11 PM

ఢిల్లీ: శరవణ  భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని చంపిన కేసులో రాజగోపాల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల రీత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజగోపాల్‌ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘ఈ కేసు విచారణ జరుగుతుండగా ఒక్క రోజు కూడా మీ ఆరోగ్యం బాగోలేదని ఎందుకు చెప్పలేదు. ఇక […]

ఇక మాటల్లేవ్.. లొంగిపోండి..శరవణ భవన్‌ యజమానికి సుప్రీం అల్టిమేటం
Follow us on

ఢిల్లీ: శరవణ  భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని చంపిన కేసులో రాజగోపాల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల రీత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజగోపాల్‌ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

‘ఈ కేసు విచారణ జరుగుతుండగా ఒక్క రోజు కూడా మీ ఆరోగ్యం బాగోలేదని ఎందుకు చెప్పలేదు. ఇక మీరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేము. వెంటనే లొంగిపోవాలి’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పేరొందిన వ్యాపారవేత్తగా పేరు గడించిన రాజగోపాల్‌ ఓ హత్య కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే.