Addaguduru Lockup Death Case: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్‌లో మహిళ లాకప్ డెత్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ (55) అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్ గురువారం స్పందించింది. సీఎస్, డీజీపీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, డిప్యూటీ కమిషనర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసుల్లో పేర్కొంది.
దొంగతనం కేసు విచారణలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మను అడ్డగూడూరు పోలీసులు విచారించారు. ఈ క్రమంలో భాగంగా పోలీస్ కస్టడీలో ఆమె మృతి చెందింది. తల్లి, కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపట్టారు.
అనంతరం ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మల్కాజ్‌గిరి ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. లాకప్‌డెత్ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. తాజాగా ఎస్సీ కమిషన్ కూడా నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: