రాయలసీమ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏ స్థాయిలో ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. బడా, బడా లీడర్ల సైతం ఫ్యాక్షన్ కత్తికి బలైపోయారు. కుటుంబాల మధ్య తగాదా కాస్తా.. ఊరుకి, మండలాలకి, నియోజకవర్గాలకి, జిల్లాలకి చుట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో సీమలో కూడా తుఫాకుల మోత వినిపించడం లేదు. రక్తం నేల చిందడం లేదు. అడుగుపెట్టగానే పచ్చని పైరగాలి తగులుతుంది. శనగ, కంది సహా పలు రకాల పండ్ల తోటలు దర్శనమిస్తున్నాయి. అయితే అనంతపురం జిల్లాలో తాజాగా నాటు తుపాకులు కలకలం రేపాయి. కొత్తపల్లి మండలం కదిరేపల్లి గ్రామంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటు తుపాకి, టూల్ బాక్స్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కదిరేపల్లి గ్రామంలో కోడి పుంజు కోసం వెతుకుతూ గడ్డివామువైపు వెళ్లగా నాటు తుపాకీ కనిపించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లుగా చెప్పారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్త చెరువు ఎస్సై లింగన్న. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, అసాంఘిక శక్తుల సమాచారం తెలిస్తే.. పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
Also Read: Telangana: కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి..కారణం తెలిస్తే షాకే!
స్పెషల్ సాంగ్ కు ‘ఊ’ అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే