Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

పెళ్లి బృందంలోని ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. కాగా, ఈ ట్రాక్టర్‌లో మొత్తం 25మంది పెళ్లి బృందం ప్రయాణిస్తోంది.

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Crime News

Updated on: Dec 07, 2022 | 10:46 PM

Andhra Pradesh News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద అదుపు తప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ట్రాక్టర్‌లో ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెళ్లి బృందం ప్రయాణిస్తుంది.

పెళ్లి బృందంలోని ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. కాగా, ఈ ట్రాక్టర్‌లో మొత్తం 25మంది పెళ్లి బృందం ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..