Himachal Pradesh Road Accident: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లోయలో పడి డ్రైవర్‌తో సహా 9మంది దుర్మరణం పాలయ్యారు. సిర్‌మౌర్ జిల్లా పచ్ఛాడ్ ఏరియాలోని బాగ్ పాషోగ్ గ్రామం సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన గోతిలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. మృతులు ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం సమాచారం తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరకున్నారు. పోలీసులు గోతి నుంచి కారును వెలికితీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.