రాజస్థాన్‌లో మరో దారుణం.. ఆత్యాచార బాధితురాలి ఇంటికి నిప్పు.. తీవ్రగాయాలతో మహిళ మృతి..!

|

Mar 06, 2021 | 10:11 PM

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో ఘోరానికి ఒడిగట్టారు దుండగులు. ఓ ఆత్యాచార బాధిత మహిళ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్‌తో తగలబెట్టారు.

రాజస్థాన్‌లో మరో దారుణం.. ఆత్యాచార బాధితురాలి ఇంటికి నిప్పు.. తీవ్రగాయాలతో మహిళ మృతి..!
Follow us on

Rape victim set ablaze dies : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో ఘోరానికి ఒడిగట్టారు దుండగులు. ఓ ఆత్యాచార బాధిత మహిళ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్‌తో తగలబెట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమన్‌గర్‌ జిల్లాలోని గోలువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళ ఇంటికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి బయట నుంచి ఆమెను పేరుతో పిలిచారు. దీంతో ఆమె ఇంటి తలపు తీయగా కిరోసిన్‌ పోసి వెంటనే నిప్పుపెట్టి పారిపోయారు. ఇంటిలో ఒక్కసారిగా తీవ్రంగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆ మహిళ శరీరం సగం కంటే ఎక్కువగా కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమె శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహిళ అమ్మమ్మ తన మనమరాలిపై ఆత్యాచారం చేసిన నిందితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందిన అత్యాచార బాధిత మహిళ కుటుంబ సభ్యులకు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ రూ.5 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించినట్ల సీఎం కార్యాలయం ప్రకటించింది.

Read Also..  ఒక్క సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్.. ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యువల్‌.. అందుబాటులోకి రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు