ఢిల్లీ: స్వామీజీ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు, పలు అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా తనకు పెరోల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులకు దరాఖాస్తు చేసుకున్నాడు. అందుకు కారణం ఏం చెప్పాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వ్యవసాయం చేసుకుంటాను పెరోల్ ఇవ్వండి మహాప్రభో అని జైలు అధికారుల్ని అభ్యర్థించాడు.
అయితే ఆ దరఖాస్తులో డేరా బాబా చెప్పిన విషయాలే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతను చేసినవి క్షమించరాని నేరాలేం కావట..పైగా జైలులో కూడా సత్ప్రవర్తనతో మెలుగుతోన్నా కాబట్టి తాను పెరోల్‌కు అర్హుడినేని తనకు తానే సర్టిపై చేసుకున్నాడు. సిర్సా జైలు యాజమాన్యం ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తోంది.
కాగా అత్యాచారం, విదేశీయులు హత్య లాంటి తదితర అరోపణలతో గత 23 నెలలుగా డేరా బాబా జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ దొంగ బాబా.. సిర్సా డిప్యూటీ కమిషనర్‌కు పెరోల్ దరఖాస్తు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.