Crime News: తాజాగా రిలీజైన ‘రాహు’ మూవీలో హీరోయిన్‌గా నటించిన క్రితి గార్గె మిస్సయ్యింది. ఈ విషయమై పంజాగుట్టలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు డైరెక్టర్ సుబ్బు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉందని.. అర్జెంట్‌గా ముంబై రమ్మన్నారని తనకు చెప్పి.. వెళ్లినట్టు పేర్కొన్న డైరెక్టర్. ఉదయం ఆమె వెళ్లినప్పటి నుంచి కలవని ఫోన్ నెంబర్. దీంతో.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు దర్శకుడు సుబ్బు.
అయితే.. దీనిపై స్పందించిన హీరోయిన్ క్రితి గార్గే.. ముంబైలోనే నేను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నెట్‌వర్క్ సరిగ్గా లేని కారణంగా సకాలంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మా డైరెక్టర్ సుబ్బు కంగారుపడి పోలీసులను ఆశ్రయించారు. సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్, మెయిల్స్ రావడంతో సుబ్బు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారని వీడియోలో తెలిపింది హీరోయిన్.