పంట పొలంలో పైథాన్…చెట్టుకు కట్టేసిన రైతులు!

|

Oct 23, 2020 | 2:40 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చెట్లు, పొదల్లో దాగివున్న క్రిమి కీటకాలు, విషసర్పాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. అలాగే వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది.

పంట పొలంలో పైథాన్...చెట్టుకు కట్టేసిన రైతులు!
Follow us on

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చెట్లు, పొదల్లో దాగివున్న క్రిమి కీటకాలు, విషసర్పాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. అలాగే వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. అది సమీపంలోనే తిరుగుతూనే ఉంటే, ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన రైతులు దానిని చెట్టుకు కట్టేసుకున్నారు..ఆ తర్వాత జరిగిందంటే..?

గుంటూరు జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు, చేపలు వరద నీటిలో పొలాల వైపు కొట్టుకొని వస్తున్నాయి. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా భారీ కొండచిలువ తప్పించుకుంటుదని భావించిన రైతులు, దానిని తాళ్ల సాయంతో సమీప చెట్టుకు కట్టేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.