గత కొద్ది రోజులుగా పంజాబ్, డిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో పోలీసులు ఈ ముఠాల కదలికలపై కన్నేసిన సంగతి తెలిసిందే. దీంతో పక్కా ప్లాన్ వేసి మరీ.. ఈ ముఠాలను పట్టుకుంటున్నారు.
తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో డ్రగ్స్ సప్లే చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్ గుర్తించారు. పంజాబ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్ వేసి ఈ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరు గత ఐదారేళ్లుగా లుధియానా ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దర్నీ.. కిరణ్ బాలా, సుమన్ బాలాగా గుర్తించారు. వీరు ఢిల్లీ, అమృత్‌సర్ ప్రాంతాల నుంచి హెరాయిన్ తీసుకు వచ్చి.. లుధియానాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ఇప్పటికే దాదాపు పన్నెండు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Punjab: Two women, who happen to be siblings, arrested in Ludhiana on charges of drug peddling; over 1 kg of drugs recovered from their possession. Gurucharan Singh, SI, STF, Ludhiana says, “They had been supplying drugs since last 6-7 years in local areas. Case registered.” pic.twitter.com/esV0KJyPjA
— ANI (@ANI) July 8, 2020