పంజాబ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ బైక్‌లో అమర్చిన బాంబు పేలడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మరో బైక్‌లో అమర్చిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. పంజాబ్‌లోని జలాలాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు గస్తీ చేస్తుండగా.. సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. అంతా బైక్ పెట్రోల్ ట్యాంక్ పెలుడుగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతా కామన్ అనుకున్నారు. కానీ విచారణ జరుపుతుంటే అసలు నిజాలు బయట పడుతున్నాయి. పేలుడు జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాలు పోలీసులకు ఆందోళనకు గురి చేశాయి. ఇది పెట్రోల్ ట్యాంక్ పేలుడు కాదని బాంబ్ బ్లాస్ట్‌గా నిర్ధారించుకున్నారు.
మొదట ఈ పేలుడు సాధారణంగా జరిగిందని భావించిన పోలీసులు.. ఆ తర్వాత ఉగ్రవాద కోణం ఉందని భావించి గస్తీ ముమ్మరం చేశారు. ఇక పంజాబ్ బాంబుపేలుళ్ల నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా దాడి చేసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను హెచ్చరించారు. స్థానికంగా ఎలాంటి అనుమానితులు కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..