Cyber Fraud Alert: సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం.. పెంపుడు కుక్క విక్రయం పేరుతో..

| Edited By: Janardhan Veluru

Jul 22, 2021 | 11:05 AM

Cyber Crime News: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులు, మీడియా పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు ఓ అడుగు వారికంటే ముందే ఉంటున్నారు.

Cyber Fraud Alert: సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం.. పెంపుడు కుక్క విక్రయం పేరుతో..
Dog
Follow us on

Cyber Fraud: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా..సైబర్ నేరగాళ్లు ఓ అడుగు వారికంటే ముందే ఉంటున్నారు. సైబర్ కేటుగాళ్ల ఆగడాలు ఏ స్థాయికి చేరాయో పూణెలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. పూణెకి చెందిన ఓ యువకుడికి పెట్స్ అంటే చాలా ఇష్టం. విదేశీ బ్రీడ్ కుక్క పిల్లను ఇంట్లో పెంచుకోవాలనుకున్నాడు. విదేశీ బ్రీడ్ కుక్కను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌ను చూసి.. ఆ వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించాడు. రూ.9 వేలకు ఆ కుక్కను విక్రయించేందుకు ఎదుటి వ్యక్తి అంగీకరించాడు. డబ్బును గూగిల్ పే చేస్తే…కుక్క పిల్లలను అతని ఇంటికి పంపుతానంటూ నమ్మబలికాడు. ఎదుటి వ్యక్తి మోసాన్ని గుర్తించలేని యువకుడు రూ.9000 గూగిల్ పే ద్వారా అతని బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఇచ్చిన మాట ప్రకారం కుక్క పిల్ల తన ఇంటికి రాకపోవడంతో యువకుడు ఆ వ్యక్తికి కాల్ చేశాడు. అయితే కుక్క పిల్ల చనిపోయిందని సమాధానమిచ్చిన నిందితుడు..డబ్బు తిరిగి ఇవ్వకుండా ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. సైబర్ నేరగాడి చేతిలో తాను మోసపోయినట్లు తెలుసుకున్న ఆ యువకుడు పోలీసులను సంప్రదించాడు. పెంపుడు కుక్కను విక్రయించే నెఫంతో రూ.9 వేల మోసగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూణె పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

పెంపుడు కుక్క పిల్లల విక్రయం పేరుతూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారని..వీరి వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read..

జూలై నెలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన అధ్యాయనాలు..

రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!