బెజవాడ గుండెల్లో గుబులు.. చికటి పడిందంటే కనిపించే “మంకీ మ్యాన్”..! మహిళలే టార్గెట్..! ఏం చేస్తాడో తెలుసా..!

|

Jun 30, 2021 | 11:22 AM

Vijayawada Psycho: బెజవాడలో సైకో దడ పుట్టిస్తున్నాడు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్, మంకీ క్యాప్‌తో ఇళ్లలో దూరి చాటుమాటున మహిళలను తడిమి చూస్తున్న సైకో బెజవాడ పోలీసులకు కొత్త సమస్యగా మారాడు. ఏడాది కాలంగా ఈ సైకో ఇళ్లలో దూరి భయాందోళనకు గురి చేస్తున్నాడు. సైకో నుంచి రక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించారు స్థానికులు.

బెజవాడ గుండెల్లో గుబులు.. చికటి పడిందంటే కనిపించే మంకీ మ్యాన్..! మహిళలే టార్గెట్..! ఏం చేస్తాడో తెలుసా..!
Vijayawada Psycho
Follow us on

బెజవాడలో సైకో దడ పుట్టిస్తున్నాడు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్, మంకీ క్యాప్‌తో ఇళ్లలో దూరి చాటుమాటున మహిళలను తడిమి చూస్తున్న సైకో బెజవాడ పోలీసులకు కొత్త సమస్యగా మారాడు. ఏడాది కాలంగా ఈ సైకో ఇళ్లలో దూరి భయాందోళనకు గురి చేస్తున్నాడు.  అసలు బెజవాడలో ఏం జరుగుతోంది…? ఎవరీ మంకీ మ్యాన్..? మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? మంకీ మ్యాన్ ఒక్కడేనా.. ఈ ప్రచారాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా..? నిఘాకు ఎందుకు చిక్కడం లేదు..?

అసలు బెజవాడలో ఏం జరుగుతోంది…?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలను తెలుసుకునేందుకు మందు.. అసలు విజయవాడలో ఏం జరిగిందో ఓ సారి చుద్దాం… చీకటి పడిందంటే ఇళ్ళలోకి దూరి, కిటికీ చాటున, బాత్‌రూంల మాటున నక్కి చూస్తుంటాడు. ఇలా తన పని మొదలు పెడుతాడు.. మహిళలు మాత్రమే ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుంటాడు. యువతుల శరీర భాగాలను చూస్తూ ఆ సైకో పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్, అశోక్‌నగర్లలో ఓ సైకో దడ పుట్టిస్తున్నాడు. సంవత్సరన్నర నుంచి బెజవాడ వాసులకు ఆ సైకో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సైకో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

మంకీ మ్యాన్ స్పెషల్ డ్రెస్..

సంవత్సరన్నర నుంచి పోలీసులకు చిక్కకుండా సైకో తప్పించుకు తిరుగుతున్నాడు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్ ధరించి ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకుంటున్నాడు. మహిళలే టార్గెట్‌గా అర్ధరాత్రి ఇళ్ళలోకి చొరబడుతున్న ఆ సైకో వ్యక్తి ఎవరనేది అంతుబట్టని అంశంగా మారింది.

స్థానికులు పట్టుకోవాలని చూసినా ఆ సైకో చిక్కడం లేదు. ఎవరైనా పట్టుకోడానికి ప్రయత్నిస్తే దొరక్కుండా జారి పోయేందుకు ఒంటిపై ఆయిల్ రాసుకుని అదృశ్యమవుతున్నాడు. సైకో నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.

అయితే పోలీసలు పెట్టిన నిఘాకు కూడా చిక్కడం లేదు. అయితే ఇది చేస్తున్నది ఆకతాయిలా.. దొంగలా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ మంకీ మ్యాన్‌ను పట్టుకుంటామని బెజవాడ పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి : Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం… కేబినెట్ విస్తరణపై ఫోకస్..

Lovers Suicide: తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య.. కన్నీరు మున్నీరవుతున్న ఇరు కుటుంబాలు