చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య.. గత రెండు రోజులుగా అనారోగ్యం.. సూసైడ్‌పై ఆరా తీస్తున్న జైలు సిబ్బంది

Cherlapally Central Jail: కొందరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు..

చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య.. గత రెండు రోజులుగా అనారోగ్యం.. సూసైడ్‌పై  ఆరా తీస్తున్న జైలు సిబ్బంది
Cherlapally Central Jail

Updated on: Jul 18, 2021 | 3:03 PM

Cherlapally Central Jail: కొందరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడటం సంచనలం రేపుతోంది. ఓ హత్య కేసులో బానోత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ అనే వ్యక్తి చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా గత రెండు రోజులుగా జైలులోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బెడ్‌ షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.  హుటాహుటిన  జైలు సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. కాగా, 2019లో సూర్యాపేటలో జరిగిన ఓ హత్య కేసులో శ్రీనివాస్‌ జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, ఖైదీ ఆత్మహత్యపై జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులు కూడా ఎవరూ రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Children Fear: కొత్త వారంటే పిల్లల్లో భయం ఎందుకు..?.. ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి.. చైల్డ్‌ సైకాలజీ నిపుణుల సూచనలు

SI Beating Woman: మహిళను కింద పడేసి దారుణంగా కొట్టిన ఎస్‌ఐ.. దుమారం రేపుతున్న వీడియో..