Andhra Pradesh: గుడికి వచ్చే మహిళలే ఇతడి టార్గెట్‌.. దెయ్యాల పేరుతో కామవాంచ తీర్చుకుంటున్న ప్రబుద్ధుడు..

|

Jul 13, 2022 | 7:45 AM

Andhra Pradesh: ఎంతో గౌరవప్రదమైన పూజారి హోదాలో ఉన్న వ్యక్తి దారి తప్పాడు. ఆలయానికి వచ్చే మహిళలను టార్గెట్‌ చేస్తూ కామవాంచ తీర్చుకుంటున్నాడు. కట్టుకున్న భార్యను టార్చర్‌ పెడుతూ...

Andhra Pradesh: గుడికి వచ్చే మహిళలే ఇతడి టార్గెట్‌.. దెయ్యాల పేరుతో కామవాంచ తీర్చుకుంటున్న ప్రబుద్ధుడు..
Follow us on

Andhra Pradesh: ఎంతో గౌరవప్రదమైన పూజారి హోదాలో ఉన్న వ్యక్తి దారి తప్పాడు. ఆలయానికి వచ్చే మహిళలను టార్గెట్‌ చేస్తూ కామవాంచ తీర్చుకుంటున్నాడు. కట్టుకున్న భార్యను టార్చర్‌ పెడుతూ ఇతర మహిళలను మోసం చేస్తున్నాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మురడి అంజన్న ఆలయంలో అనంతసేన అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో స్రవంతి అనే మహిళతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంపారం సాఫీగా సాగింది. ఆ తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలను దెయ్యం పేరుతో లొంగతీసుకుని రాసలీలు సాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్రవంతిని వేదించడం ప్రారంభించాడు.

అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నువ్వు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. భర్త ఆగడాల గురించి స్రవంతి మాట్లాడుతూ.. దెయ్యాలు పట్టిన ఆడవాళ్లు వస్తే చాలు వారిని వశపరుచుకొని కామవాంచ తీర్చుకుంటాడని తెలిపింది. ఆయన ఫోన్లో.. అలాంటి వీడియోలు ఫోటోలు చాలా ఉన్నాయని ఆరోపించింది.

ఇప్పటికే ఆయన ఆగడాలను పడలేక తాను పుట్టింటికెళ్లాననీ. ఒక సారి పెద్దమనుషుల పంచాయితీ జరిగిందనీ. అయినా సరే బుద్ధిరాని భర్త తనను చిత్రహింసలు గురిచేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా తాను పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందనీ. అయితే.. తనకు నోటీసులు పంపాడనీ.. ఇతగాడి ఆగడాలను ఇకనైనా గుర్తించి పోలీసులు తనకు న్యాయం చేయాలని స్రవంతి డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి..