అమానుష ఘటన.. కరోనా పోవాలని నరబలి..!

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ వ్యక్తిని నరబలి ఇచ్చాడు గుడి పూజారి.

అమానుష ఘటన.. కరోనా పోవాలని నరబలి..!

Edited By:

Updated on: May 29, 2020 | 7:59 AM

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ వ్యక్తిని నరబలి ఇచ్చాడు గుడి పూజారి. గుడి ఆవరణలో వ్యక్తిని హతమార్చి, ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.

వివరాల ప్రకారం.. ఒడిశాలోని కటక్‌ జిల్లా బందహుడా గ్రామంలోని ఓ గుడిలో సన్సారీ ఓజా అనే పూజారి పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సరోజ్‌ కుమార్ ప్రధాన్ అనే వ్యక్తిని ఓజా గుడి ఆవరణలో హతమార్చాడు. ఆ తరువాత పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయి.. కరోనా వైరస్‌ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు కలలో దేవుడు చెప్పాడని, అందుకే అతడిని నరబలి ఇచ్చానని పోలీసులకు చెప్పాడు. అయితే గ్రామస్థులు మాత్రం ఓజా, సరోజ్ కుమార్‌కి మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తోందని చెప్పారు. ఇక పోలీసుల వాదన ప్రకారం.. ఘటన సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నాడని, ఉదయం తప్పు తెలుసుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడని అంటున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.

Read This Story Also: 1400 కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి: సీఎం జగన్