Crime news: భార్యకు అబార్షన్ పిల్స్ ఇచ్చిన భర్త.. వేసుకున్న కొద్ది సేపటికే తీవ్ర రక్తస్రావం.. చివరకు

|

Jul 19, 2022 | 1:48 PM

భార్య, భర్త ముగ్గురు పిల్లలు ఇలా వారి కుటుంబం సంతోషంగా సాగిపోతోంది. కొంత కాలానికి భార్య మరోసారి గర్భం దాల్చింది. ఆనందపడాల్సిన భర్త కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలు వద్దని, అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా...

Crime news: భార్యకు అబార్షన్ పిల్స్ ఇచ్చిన భర్త.. వేసుకున్న కొద్ది సేపటికే తీవ్ర రక్తస్రావం.. చివరకు
Pregnancy Woman Death
Follow us on

భార్య, భర్త ముగ్గురు పిల్లలు ఇలా వారి కుటుంబం సంతోషంగా సాగిపోతోంది. కొంత కాలానికి భార్య మరోసారి గర్భం దాల్చింది. ఆనందపడాల్సిన భర్త కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలు వద్దని, అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా అబార్షన్ పిల్స్ తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని కాన్పూర్ సమీపంలో ఉన్న నౌబస్తా ప్రాంతానికి చెందిన గీతా యాదవ్ కు విపిన్ యాదవ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి గర్భం దాల్చింది. దీనిని ఇష్టం లేని భర్త.. అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు. అందుకోసం గీత కు అబార్షన్ పిల్స్ (Abortion Pill) ఇచ్చాడు. అది వేసుకున్న కొద్దిసేపటికి గీత అస్వస్థతకు గురైరంది. తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం నౌబస్తాలోని నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల మధ్యే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో మహిళ మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మహిళకు బలవంతంగా అబార్షన్ మెడిసిన్ ఇచ్చారని నిరూపిస్తే చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి