ప్రాంక్ వీడియోల పేరుతో హంగామా..బెండు తీసిన పోలీసులు

ఈ మధ్య ప్రాంక్ వీడియోల ట్రెండ్ దేశమంతా పాకింది. సరదాకి చేసేవి కాస్తా.. చిత్రవిచిత్రమైన యాక్ట్స్‌తో ప్రజలను భయపెట్టేలా ఉండటంతో పోలీసులు సదరు వీడియోలు తీసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా దెయ్యం వేషధారణలో అర్థరాత్రి రోడ్లపై వచ్చిపోయేవారిని భయపెడుతూ..న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న పోకిరీల ఆటకట్టించారు పోలీసులు. బెంగుళూరు సమీపంలోని యశ్వంత్‌పురలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లటి దుస్తులతో..విగ్గులు ధరించి..రక్తపు మరకలతో.. రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయేవారిని భయపెడుతూ వారి హావభావాలను షూట్ చేస్తున్నారు. ప్రయాణం హాడావిడిలో వెళ్తున్నవారు వీరిని […]

ప్రాంక్ వీడియోల పేరుతో హంగామా..బెండు తీసిన పోలీసులు

Edited By:

Updated on: Nov 12, 2019 | 10:48 AM

ఈ మధ్య ప్రాంక్ వీడియోల ట్రెండ్ దేశమంతా పాకింది. సరదాకి చేసేవి కాస్తా.. చిత్రవిచిత్రమైన యాక్ట్స్‌తో ప్రజలను భయపెట్టేలా ఉండటంతో పోలీసులు సదరు వీడియోలు తీసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా దెయ్యం వేషధారణలో అర్థరాత్రి రోడ్లపై వచ్చిపోయేవారిని భయపెడుతూ..న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న పోకిరీల ఆటకట్టించారు పోలీసులు. బెంగుళూరు సమీపంలోని యశ్వంత్‌పురలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తెల్లటి దుస్తులతో..విగ్గులు ధరించి..రక్తపు మరకలతో.. రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయేవారిని భయపెడుతూ వారి హావభావాలను షూట్ చేస్తున్నారు. ప్రయాణం హాడావిడిలో వెళ్తున్నవారు వీరిని చూసి ఒక్కసారిగా షాక్‌ గురై యాక్సిడెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు హార్ట్ పేషెంట్స్ లాంటి వారికి ఇలాంటివి..ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో..సరదాకి చేస్తున్నప్పటికి వారిని అరెస్ట్ చెయ్యక తప్పలేదని పోలీసులు చెప్తున్నారు. అదుపులోకి తీసుకున్నవాళ్ల సెల్‌ఫోన్స్‌లో పలు రకాల ప్రాంక్ వీడియోస్‌ను గుర్తించారు. ప్రతిదానికి హద్దులుంటాయని.. వారు ప్రాంక్స్ చేసే విధానం  శృతిమించిన నేపథ్యంలో.. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు  బెంగళూరు నార్త్‌ డీసీపీ శశికుమార్‌  తెలిపారు.

అరెస్ట్ చేసిన వ్యక్తుల వివరాలు:

షాన్ మాలిక్

నవీద్

సాజిల్ మొహమ్మద్

మొహమ్మద్ ఆక్యూబ్

షకీబ్

సయ్యద్ నబీల్

యూసఫ్ అహ్మద్‌