Kamareddy: కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు.. 23 మంది అరెస్ట్‌..

|

Jan 15, 2022 | 9:35 AM

సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందెం రాయుళ్లకు పండగే. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దుల్లో ఉండే తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున

Kamareddy: కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు.. 23 మంది అరెస్ట్‌..
Cock Fight
Follow us on

సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందెం రాయుళ్లకు పండగే. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దుల్లో ఉండే తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వీటిని అరికట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో కోడి పందేల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వమించారు. ఈ సందర్భంగా 50 బైకులు, కారు, 20 కోళ్లు, రూ.30 వేల నగదు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకున్న వందలాది మంది పందెం రాయుళ్లు ముందుగానే పరుగు లంకించుకున్నారు. కాగా ఎల్లారెడ్డిపేటకు చెందిన శివ ఆధ్వర్యంలో ఈ కోడి పందేలను నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. అయితే అతను తప్పించుకున్నాడని, 23 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Also read: ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్‌ మహింద్రా.. వీడియో

Petrol and Diesel Price: నిన్నటి ధరల వద్దే స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయంటే..

ప్రవర్తనలో తేడా !! 18 మందిని క‌రిచిన ఉడుత‌ !! చివ‌రికి ఏం జరిగిందంటే ?? వీడియో