Gun Misfire: శిక్షణలో ఉండగ తొటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి..

|

Nov 23, 2021 | 8:18 AM

Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యి ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. శిక్షణ ఉండగా తుఫాకీ మిస్‌ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌ భానుప్రసాద్‌ మృతి చెందారు...

Gun Misfire: శిక్షణలో ఉండగ తొటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి..
Follow us on

Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యి ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. శిక్షణ ఉండగా తుఫాకీ మిస్‌ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌ భానుప్రసాద్‌ మృతి చెందారు. నాందేడ్‌లో కానిస్టేబుల్‌గా భాను ప్రసాద్‌ శిక్షణ పొందుతున్నారు. ఫైరింగ్‌ శిక్షణలో తోటి ఉద్యోగి తుపాకీ పేలడంతో భానుప్రసాద్‌ ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భాను ప్రసాద్‌ స్వగ్రామం ఏపీలోని విజయనగరం జిల్లా చింతలబెలగాం. భాను మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా, ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు కానిస్టేబుళ్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే .. మరి కొందరు ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్‌ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులను వదిలి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న ఇలాంటి కానిస్టేబుళ్లు మృతి చెందుతుండటం విషాదంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

Crime News: లిప్టు పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్.. పార్క్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం.. ఢిల్లీ సివిల్ డిఫెన్స్ ఉద్యోగి అరెస్ట్!

Smuggling Airport: హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్‌.. బంగారం, విదేశీ కరెన్సీతో పాటు ఐఫోన్‌ల స్వాధీనం..