హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అఘాయిత్యాని యత్నించారు. దీంతో ఎదురించిన అమ్మాయిని గాయపర్చారు. ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు అత్యంత అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో టీవీ9తో డాక్టర్ సౌజన్యరెడ్డి మాట్లాడుతూ.. బీ ఫార్మసీ స్టూడెంట్‌పై లైంగిక దాడి జరిగింది. అమ్మాయి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి సెమి కాన్షియల్‌లో ఉంది. తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అమ్మాయిని చికిత్స తర్వాత పోలీసులకు అప్పగించాము. వారు వివరాలు సేకరిస్తున్నారు. ఆమె తీవ్ర భయాందో ఉంది అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
కాగా, సదరు బాధితురాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన చెందిన అమ్మాయి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఆటోలో ఉన్నారు. అయితే, కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు.
ఆటోలో ఒంటరిగా ఉన్న అమ్మాయి చూసిన ఆటో డ్రైవర్ అలోచనలు పక్కదారి పట్టాయి. ఇదే అదనుగా భావించి ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే యామన్నపేట దగ్గర వేచి ఉన్న మరో వ్యాన్‌లోకి ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా ఎక్కించారు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి.. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. అయితే, అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విన్పించడంతో అక్కడి నుంచి మకాం మార్చారు. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే టో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. ఎట్టకేలకు రాత్రి 7:50 గంటల ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జీడిమెట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, ఇటీవల ఇలాంటి ఘటనలో ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న మానవమృగాళ్లపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, తోలి విద్యార్థులు కోరుతున్నారు.