Pakistan: Hidden Cameras: వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఉదంతం పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు నీచ పనులకు పాల్పడుతున్నారు. మహిళా టీచర్లే పిల్లల సభ్య సమాజం తలదించుకునే పనికి ఒడిగట్టారు. ఈ ఘటన పక్కనే పాకిస్థాన్ దేశంలో జరిగింది. ఓ బాలికల ప్రైవేట్ స్కూల్ వాష్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చిన వ్యవహారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా అధ్యాపకులే, బాలికల వీడియోలు తీసి ఇతరులకు షేర్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో వెలుగుచూసింది. బాలికల ప్రైవేటు పాఠశాల వాష్‌రూమ్‌లలో కెమెరాలు ఉన్నాయని చాలా మంది మహిళా టీచర్లు, బాలికలు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో సింధ్ విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేటు పాఠశాలలోని వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరిస్తున్నారని విద్యా శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సింధ్ విద్యా శాఖ ఆ ప్రైవేటు పాఠశాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి రికార్డు చేసిన వీడియోలపై దర్యాప్తు సాగిస్తోంది. వాష్ రూంలలో మహిళా టీచర్లు, విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించారని సింధ్ విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో తాము ఈ వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటామని సింధ్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్రైం జోన్ హెడ్ ఇమ్రాన్ రియాజ్ చెప్పారు. కాగా పాఠశాల వాష్ రూంలలో పర్యవేక్షణ కోసమే తాము కెమెరాలు అమర్చామని పాఠశాల అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. కాగా, స్కూల్ యాజమాన్య తీరు పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also.. Crime News: చిల్లర డబ్బుల కోసం డిమాండ్.. మాట వినకుంటే హతం.. 15 రోజుల్లో 3 హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్