Vanajeevi Ramaiah: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో ప్రముఖులు ప్రాణాలు వదులుతున్నారు. ఇక తాజాగా ఖమ్మం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో పద్మశ్రీ వనజీవి రామయ్య గాయపడ్డారు. స్థానికులు గమనించి ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రామయ్య.. బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రోడ్డు దాటుతున్న తరుణంలో మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నారు.
2019 మార్చిలో వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.
2017లో రామయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. సుమారు 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య చెబుతారు. రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశంగా కూడా చేర్చింది. మొక్కల పెంపకంపై రామయ్య ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు. దీంతో ఆయనను వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు. మొక్కల పెంపకం కోసం చేస్తున్న కృషికి గాను రామయ్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది ప్రభుత్వం. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో రకరకాల గింజలు సేకరిస్తారు. వర్షాకాలంలో వీటిని రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నాటుతారు. రామయ్యది ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి రామయ్య స్వగ్రామం. ఆయన ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. మత్తగూడెం స్కూల్లో టీచర్ మల్లేషం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు రామయ్య జీవితాన్ని ప్రభావితం చేశాయి. తొలుత తన ఇంట్లో మొక్కలను పెంచాడు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ స్థలం కన్సిస్తే అక్కడ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి