తబ్లీఘీ జమాత్‌కు భారీ షాకిచ్చిన కేంద్రం..

| Edited By:

Jun 04, 2020 | 5:44 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ వ్యవహారం గురించి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో తబ్లీఘీ జమాత్‌ సమావేశం ఏర్పాటు చేసింది

తబ్లీఘీ జమాత్‌కు భారీ షాకిచ్చిన కేంద్రం..
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ వ్యవహారం గురించి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో తబ్లీఘీ జమాత్‌ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారే. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో.. వీరు లాక్‌డౌన్‌ నిబంధనలను కూడా ఉల్లంఘించి.. కరోనా వ్యాప్తికి కారకులయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. వీరిపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి వచ్చి.. తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీయులు వేల మంది ఉన్నట్లు గుర్తించారు. విజిటింగ్ వీసాలపై వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై వీసా నిబంధనల యాక్ట్‌తో పాటు.. ఇతర కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాదు.. తాజాగా వీరిపై కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చి.. తబ్లీఘీ జమాత్ సమావేశాల్లో పాల్గొన్న 2,200 మందిపై వీసా ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. పదేళ్ల పాటు భారత్‌లో అడుగు పెట్టకుండా వీరిపై నిషేధం విధించింది.