Online Loan Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల కేసులో రోజురోజుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ ఆన్‌లైన్ రుణాల యాప్‌ల వెనుక మరో ఐదుగురు చైనీయులున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. వీరు ఏడు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను నడుపుతున్నట్లు తేల్చారు. ఈ కంపెనీల కాల్ సెంటర్లు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో మకాం వేసి నిందితుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన చైనా దేశీయుడు డెన్నిన్ కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతుండటంతో మరో ఏడు మైక్రో ఫైనాన్స్ కంపెనీల వివరాలు బయటకు వచ్చాయి.
ఐదుగురు చైనీయులు భారత్‌లో ఉంటూ వీటిని నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలన్నీ హాంకాంగ్ నుంచి జరుగుతున్నట్లు సాంకేతిక ఆధారాలను గుర్తించారు పోలీసులు. ఈ ఏడు కంపెనీలకు భారత్‌లోని నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు గానీ, ఆర్బీఐ అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు.
Also Read: TRP scam case: టీఆర్పీ కుంభకోణంలో మరో మలుపు.. కీలక విషయాలు వెల్లడించిన బార్క్ మాజీ చీఫ్..