మంచితనానికి పోతే మొదటికే మోసం.. షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి వ్యక్తులు ఎదురైతే జాగ్రత్త!

సైబర్ నేరగాళ్ల ఆలోచన తీరు పోలీసుల కంటే, మనకంటే ఒక అడుగు ముందుగానే ఉంటుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరస్తులు కూడా కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే లక్షల రూపాయలను మన నుండి కాజేస్తుంటారు.

మంచితనానికి పోతే మొదటికే మోసం.. షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి వ్యక్తులు ఎదురైతే జాగ్రత్త!
Cyber Criminals

Edited By:

Updated on: Mar 22, 2026 | 10:32 AM

సైబర్ నేరగాళ్ల ఆలోచన తీరు పోలీసుల కంటే, మనకంటే ఒక అడుగు ముందుగానే ఉంటుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరస్తులు కూడా కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే లక్షల రూపాయలను మన నుండి కాజేస్తుంటారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా అనేక సైబర్ నేరాలు చోటుచేసుకుంటున్నాయి.

షాపింగ్ కోసం సరదాగా మాల్స్‌కు వెళ్లే వారిని టార్గెట్‌గా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. షాపింగ్ మాల్ లో డీసెంట్ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ లాగా కనిపించే వ్యక్తి రూపంలో మన దగ్గరికి వచ్చి ఏదైనా బ్యాంకింగ్ సహాయం లేదా పెన్షన్ రావడం లేదని చెప్పి మనల్ని సహాయం అడుగుతారు. అవతల వ్యక్తిపై ఉన్న సానుభూతితో అతడి వివరాలు ఏమీ తెలియకుండానే అతని ఫోన్‌ను మన చేతిలోకి తీసుకొని అతడికి సంబంధించిన వివరాలను చెక్ చేసి సరిచేసి ఇస్తాము. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళకు అస్త్రంగా మారుతుంది.

గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మన చేతికి ఫోన్ ఇచ్చి సహాయం అడగగానే ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేసేస్తుంటాము. అలా అవతల వ్యక్తి ఫోన్ మన చేతిలో పడగానే అప్పటికే సీక్రెట్ వీడియో రికార్డింగ్ ఆన్ అయి ఉంటుంది. మనకి తెలియకుండానే మన ఫింగర్ ప్రింట్స్ ను అవతల వ్యక్తులు దొంగలిస్తున్నారు. మనకి తెలియకుండానే మన ఐరిస్ ను సైతం సీక్రెట్ గా క్యాప్చర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

వీటి ద్వారా మనకి తెలియకుండానే కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం లేదా ఆన్‌లైన్‌లో లోన్ అప్లికేషన్స్ లో మన పేరుతో అప్లై చేసి లక్షల్లో లోన్లు తీసుకుంటున్నారు.. చివరికి అవి కట్టాల్సిన టైములో మన వివరాలు బ్యాంక్ అధికారుల దగ్గర ఉండటం బ్యాంక్ అధికారులు మనల్ని వేధించడం జరుగుతుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలంటే గుర్తు తెలియని వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు సైబర్ నిపుణులు. మంచితనానికి పోతే తిరిగి మన ఖజానా ఖాళీ అయినట్టు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి.

సైబర్ నేరానికి బాధితులుగా మారి ఉంటే 1930 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయండి. డబ్బు పోయిన కొద్ది గంటల్లోనే ఫిర్యాదు చేస్తే ఆ డబ్బును బ్యాంక్ అధికారుల ద్వారా ఫ్రీజ్ చేయించి కొద్ది రోజుల్లోనే మీ డబ్బు మీకు రిఫండ్ అయ్యేలాగా పోలీసులు చేస్తారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us