హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. బహదూర్‌పల్లి నుంచి దూలపల్లికి వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడు బహదూర్‌పల్లికి చెందిన బాలకృష్ణ గుర్తించారు పోలీసులు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను మరొక ఆస్పత్రికి పంపారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడం, పలు అనుమానాలకు దారి తీసింది. అతను మద్యం సేవించి కారు నడిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలే అది మూల మలుపు. పైగా అతి వేగం, అంతకు మించి మద్యం సేవించి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా రెండురో జుల క్రితం గచ్చిబౌలిలోనూ ఇదేవిధంగా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Also read:
Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!
Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!
School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్‌లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!