Crime News: దారుణం.. పెళ్లైన నెలకే భార్యను అమ్మి స్మార్ట్‌ఫోన్ కొన్నాడు.. వివరాలు తెలిస్తే షాకే..

|

Oct 23, 2021 | 1:08 PM

Odisha teen sold wife: యువకుడికి 17 ఏళ్లు, మహిళకు 26 ఏళ్లు.. కలకాలం తోడుంటానని.. పెద్దల సమక్షంలో ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. చివరకు పొట్టకూటి కోసం

Crime News: దారుణం.. పెళ్లైన నెలకే భార్యను అమ్మి స్మార్ట్‌ఫోన్ కొన్నాడు.. వివరాలు తెలిస్తే షాకే..
Crime News
Follow us on

Odisha teen sold wife: యువకుడికి 17 ఏళ్లు, మహిళకు 26 ఏళ్లు.. కలకాలం తోడుంటానని.. పెద్దల సమక్షంలో ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. చివరకు పొట్టకూటి కోసం ఆమెను వేరే రాష్ట్రానికి పనికి తీసుకెళ్లాడు. పెళ్లై నెల కాకముందే ఆమెను లక్ష రూపాయలకు అమ్మి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ యువకుడిని జైలుకు పంపించారు. ఒడిశా బలంగీర్ జిల్లాలోని బెల్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడు.. 26 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. నెల కాకముందే.. మహిళను మధ్యప్రదేశ్ సరిహద్దులోని రాజస్థాన్ బారన్‌ జిల్లాలోని ఓ గ్రామానికి ఇటుక బట్టీ పనుల కోసం తీసుకెళ్లాడు. ఇటుక బట్టీలో పనికి కుదిరిన అనంతరం బట్టీ యజమాని 55 ఏళ్ల వ్యక్తికి విక్రయించాడు. రూ.లక్షా, 8వేలకు ఆమెను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం స్మార్ట్ ఫోన్ కొని యువకుడు ఒడిశాలోని ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిపాడు. అనుమానం వచ్చిన మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. భార్యను అమ్మినట్లు రికార్డింగులు ఉన్నాయి. వెంటనే పోలీసులు యువకుడిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. వివరాలన్నీ చెప్పాడని పోలీసులు తెలిపారు. భార్యను రూ.లక్షకు అమ్మి సెల్ ఫొన్ కొన్నట్లు చెప్పాడని తెలిపారు.

జూలైలో పెళ్లి జరిగిన అనంతరం.. ఆగస్టులో ఈ జంట ఇటుక బట్టీలో పని చేయడానికి రాయపూర్, ఝాన్సీ మీదుగా రాజస్థాన్ వెళ్లారని.. ఈ క్రమంలో యువకుడు తన భార్యను బరాన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి 1.8 లక్షలకు విక్రయించాడని బలంగీర్ జిల్లా బెల్పాడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ బులు ముండా తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు అనంతరం అతి కష్టం మీద మహిళను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 17 ఏళ్ల యువకుడిని శుక్రవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: హైదరాబాద్‌లో అమానుషం.. చెత్తకుండీలో శిశువు మృతదేహం.. రంగంలోకి పోలీసులు..

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..