నేటితో ముగిసిన నూతన్ నాయుడు పోలీసు కస్టడీ

|

Sep 15, 2020 | 11:33 AM

ఆంధ్రప్రదేశ్ లో శిరోముండనం కేసులో నూతననాయుడు పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.

నేటితో ముగిసిన నూతన్ నాయుడు పోలీసు కస్టడీ
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో శిరోముండనం కేసులో నూతననాయుడు పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. శ్రీకాంత్‌కి గుండు గీయమని తాను చెప్పలేదని… తనకు ఆరోగ్యం బాగోలేదని నూతన నాయుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు నూతన్ నాయుడుని విచారించిన పోలీసులకు సరియైన సమాచారం దొరకలేదని తెలిస్తోంది. విచారణలో ఏ విషయాలను నూతన్ నాయుడు ప్రస్తావించనట్లు పోలీసు అధికారు తెలిపారు. అయితే, మాజీ ఐఏఎస్ అధికారి టీవీ రమేష్ పేరు చెప్పి పనులు చేయించుకుని పరిస్థితి తనకు లేదని పోలీసుల విచారణలో తెలిపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో నూతన నాయుడుని పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

విశాఖ నగరం మహారాణిపేట స్టేషన్ లో నూతన్ నాయుడుపై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి.. పోలీసుల విచారణ చేపట్టారు. తెలంగాణకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి ఎస్బీఐలో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని చెప్పి రూ.12కోట్లు, నూకరాజు అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు కేసు నమోదైంది. కాగా, పోలీసులు వారి బ్యాంకు ఖాతాలపై, ఇతరత్రా లావాదేవీల గురించి ఆరా తీసినప్పటికీ నూతన్ నాయుడు సరియైన ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, నూతన్ నాయుడిని మరోసారి పోలీసులు కస్డడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉందని