AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నలుగురు నర్సులూ ఇక ఇంటికేనా ?

ఒడిశా..మల్కాన్ గిరి లోని ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలు తీసి రికార్డు చేసిన నలుగురు నర్సులమీదా ఉద్వాసన వేటు పడనుంది. వీరిని సెలవుపై వెళ్ళాల్సిందిగా మల్కాన్ గిరి జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ అగర్వాల్ ఆదేశించారు. జిల్లా మెడికల్ కార్యాలయం నుంచి అందిన సిఫారసు మేరకు ఆయన ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ నర్సుల వ్యవహారంపై విచారణకు ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించే సూచనలతో వీరిపై తదనంతర చర్యలు తీసుకోనున్నారు. రూబీ రే, […]

ఈ నలుగురు నర్సులూ ఇక ఇంటికేనా ?
Anil kumar poka
|

Updated on: Jun 28, 2019 | 8:08 PM

Share

ఒడిశా..మల్కాన్ గిరి లోని ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలు తీసి రికార్డు చేసిన నలుగురు నర్సులమీదా ఉద్వాసన వేటు పడనుంది. వీరిని సెలవుపై వెళ్ళాల్సిందిగా మల్కాన్ గిరి జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ అగర్వాల్ ఆదేశించారు. జిల్లా మెడికల్ కార్యాలయం నుంచి అందిన సిఫారసు మేరకు ఆయన ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ నర్సుల వ్యవహారంపై విచారణకు ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించే సూచనలతో వీరిపై తదనంతర చర్యలు తీసుకోనున్నారు. రూబీ రే, తాపసి బిశ్వాస్, స్వప్న బాల, నందిని రే అనే వీరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని పిల్లల ప్రత్యేక వ్యాధుల చికిత్సా వార్డులో టిక్ టాక్ వీడియోలు రికార్డు చేశారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వార్డులోనే ‘ ఎంజాయ్ ‘ చేశారు. వీరి వైద్య నిర్లక్ష్యం వీరి ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. ఆసుపత్రి అధికారిక యూనిఫామ్ లోనే ఈ నర్సులు ఇలా చేస్తూ టిక్ టాక్ వీడియోలు తీయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తమ డ్యూటీ అయిపోయిన తరువాత తామీ వీడియో తీశామని ఈ నర్సులు తమ సంజాయిషీలో తెలిపారు. కానీ యూనిఫామ్ లో తామిలా చేయడం తప్పే అని వారు అంగీకరించారు. ప్రాణాంతక వ్యాధులతో తల్లడిల్లే చిన్నారుల వైద్య చికిత్సకు సంబంధించిన వార్డులోనే వారిలా చేయడం పెను విమర్శలకు దారి తీసింది. పైగా మల్కాన్ గిరిలో శిశు మరణాలు అధికం కూడా.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే