Petrol Attack: నిర్మల్ జిల్లాలో దారుణం.. సంతకం పెట్టలేదని ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్

ఉపాధి హామీ కార్యాలయంలో పెట్రోల్‌ దాడి కలకలం సృష్టించింది. నిర్మల్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన జరిగింది. పెట్రోల్‌ దాడికి పాల్పడింది ఓ గ్రామ సర్పంచ్ కావడం విశేషం.

Petrol Attack: నిర్మల్ జిల్లాలో దారుణం.. సంతకం పెట్టలేదని ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్
Sarpanch Petrol Attack On Officer

Updated on: Jul 13, 2021 | 6:38 PM

Sarpanch attack on dumb officer Nirmal District: ఉపాధి హామీ కార్యాలయంలో పెట్రోల్‌ దాడి కలకలం సృష్టించింది. నిర్మల్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన జరిగింది. పెట్రోల్‌ దాడికి పాల్పడింది ఓ గ్రామ సర్పంచ్ కావడం విశేషం. తనకు రావాల్సిన చెక్కులపై అధికారి సంతకం పెట్టడం లేదంటూ ఆగ్రహంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సౌంవ్లీ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజు అనే మూగ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పటించారు సర్పంచ్ సాయినాథ్ కుబీర్. ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ఫ్లాన్ ప్రకారం తీసుకువచ్చిన పెట్రోల్ ను అతని పై పోసి నిప్పటించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది, స్థానికుల సాయంతో రాజును భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…. Love Failure Viral Video: ప్రియుడికి పెళ్లి.. గుండెలు పగిలేలా ప్రేయసి రోదన.!ప్లీజ్ ఒక్కసారి బయటకి రా అంటూ