Newly Wed Couple dies: సౌతాఫ్రికాలో విషాదం.. పెళ్లైన వారం రోజులకే భారత సంతతి నవ దంపతులు మృతి!

|

Jun 15, 2021 | 3:02 PM

వారం రోజుల క్రితం పెళ్లైన భారత సంతతికి చెందిన నవ దంపతులు సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Newly Wed Couple dies: సౌతాఫ్రికాలో విషాదం.. పెళ్లైన వారం రోజులకే భారత సంతతి నవ దంపతులు మృతి!
murder
Follow us on

Newly Wed Indian Couple dies: వారం రోజుల క్రితం పెళ్లైన భారత సంతతికి చెందిన నవ దంపతులు సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణాఫ్రికాలోని జోహ‌న్నెస్ బ‌ర్గ్‌లో నివాసముండే జ‌హీర్ స‌రాంగ్‌, న‌బీల్హా ఖాన్‌ ఇంటిలోని బాత్రూంలో చనిపోయి ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ తమ రూమ్ నుంచి బయటకు రాకపోవడంపై అనుమానం వచ్చి.. కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా.. ఇద్దరు బాత్రూంలో చనిపోయి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకుని దంపతులిద్దరూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని జోహ‌న్నెస్ బ‌ర్గ్‌లో ఉండే జ‌హీర్ స‌రాంగ్‌, న‌బీల్హా ఖాన్‌కు రెండు వారాల క్రిత‌మే వివాహం జరిగింది. ఇటీవ‌లే హనీమూన్ వెళ్లొచ్చారు. జోహ‌న్నెస్ బ‌ర్గ్ వ‌చ్చిన త‌ర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఆదివారం ఇలా విద్యుదాఘాతానికి బ‌లైంది. మొద‌ట బాత్రూంలో భార్య క‌రెంట్ షాక్‌కు గురి కాగా.. ఆమెను కాపాడే ప్రయ‌త్నంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మ‌ధ్యాహ్నం దంప‌తులిద్దరూ బాత్రూంలో విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌డం చూసిన కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారి స‌మాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి త‌ర‌లించారు.

జ‌హీర్ స‌రాంగ్‌, న‌బీల్హా ఖాన్ బాత్రూంలోని ష‌వ‌ర్‌ ట్యాప్‌కు విద్యుత్ ప్రసారం కావ‌డంతోనే చ‌నిపోయిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. అయితే, దంప‌తుల మృతికి అస‌లు కార‌ణం ఏంట‌నేది మాత్రం పోస్టుమార్టం నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే తెలుస్తుంద‌ని స్థానిక పోలీసు అధికారి మ‌వేలా మ‌సండో తెలిపారు. ఇప్పటికే ఈ ఘ‌ట‌న‌పై జోహ‌న్నెస్ బ‌ర్గ్ సిటీ విద్యుత్ శాఖతో క‌లిసి ద‌ర్యాప్తు ముమ్మరం చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌లే హ‌నీమూన్ వెళ్లొచ్చిన జంట‌.. ఇలా రోజుల వ్యవ‌ధిలోనే క‌రెంట్ షాక్‌తో చ‌నిపోవ‌డం ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Read Also…  Covid-19 Vaccine: వ్యాక్సిన్లపై అపోహలు వీడండి.. అర్హులైనవారు వెంటనే కోవిడ్ టీకాను వేయించుకోండి..