వరకట్న వేధింపులకు నవవధువు బలి..

వరకట్న వేధింపులకు నవవధువు బలి అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సుబ్బయ్య ఆర్చిడ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి నవవధువు శేష సంతోషి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన శేష సంతోషికి...

వరకట్న వేధింపులకు నవవధువు బలి..

Edited By:

Updated on: May 07, 2020 | 3:35 PM

వరకట్న వేధింపులకు నవవధువు బలి అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సుబ్బయ్య ఆర్చిడ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి నవవధువు శేష సంతోషి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన శేష సంతోషికి ఫిబ్రవరి నెలలో కోదాడకు చెందిన కోటేశ్వరరావు (30)తో వివాహం జరిగింది. కోటేశ్వరరావు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

కూతురు ఆత్మహత్యపై స్పందించిన తండ్రి.. ఆమె భర్త కోటేశ్వరరావు, అత్త, మామల వేధింపుల వలనే చనిపోయిందని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అదనపు కట్నం కోసం వేధించడం వలనే చనిపోయిందని ఆయన ఆరోపిస్తున్నాడు. తన కూతురు భర్త, అత్త మామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా తన భర్త, అత్త మామల వేధింపుల వలనే చనిపోతున్నట్లు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకుంది శేష సంతోషి. సూసైడ్ నోటు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Read More: 

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్