Cyber Crime: హైదరాబాద్‌లో మరో కొత్త రకం సైబర్‌ మోసం.. పీఎం సహాయ నిధి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కుచ్చు టోపీ.

|

Aug 01, 2021 | 8:04 AM

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఓవైపు పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలకు సైబర్‌ నేరాల గురించి విడమరిచి చెబుతున్నా మోసాలు మాత్రం...

Cyber Crime: హైదరాబాద్‌లో మరో కొత్త రకం సైబర్‌ మోసం.. పీఎం సహాయ నిధి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కుచ్చు టోపీ.
Cyber Crime Hyderabad
Follow us on

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఓవైపు పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలకు సైబర్‌ నేరాల గురించి విడమరిచి చెబుతున్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు దొంగతనాలు అంటే భౌతికంగా చేసేవారు.. కానీ ఇప్పుడు టెక్నాలజీని ఆసరగా చేసుకొని ఎక్కడో కూర్చొని మన ఖాతాలో డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరాలను అరికట్టడానికి ఏకంగా సైబర్‌ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారంటేనే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో మరో కొత్త రకం సైబర్‌ మోసం బయటపడింది. ఈ మోసం బారిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పడడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి గత నెల 29న ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన సదరు వ్యక్తి మాట్లాడుతూ.. తాను ప్రధానమంత్రి సహాయ నిధికి చెందిన అధికారినని పరిచయం చేసుకున్నాడు. అనంతరం మీకు రుణం మంజూరైందని చెప్పి.. ఫోన్‌పై నెంబర్‌ చెబితే డబ్బులు పంపుతామని చెప్పాడు. దీంతో ఇది నిజమే అనుకొని తన ఫోన్‌ పే నెంబర్‌ను చెప్పాడు. మొదట రూ. 30 వేలు, ఆ తర్వాత రూ. 5 వేలు రిక్వెస్ట్‌ రావడంతో దానికి ఓకే చేశాడు. దీంతో ఖాతాలోని రూ. 35 వేలు నేరగాడి అకౌంట్‌లోకి వెళ్లిపోయింది. తీరా మోసపోయాననని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: Hyderabad: నాపై కూర్చొని.. కాళ్లు, చేతులు కట్టేశారు.. టీవీ9తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..

పాతిపెట్టిన శవం.. అర్ధరాత్రి సమాధి నుంచి మాయం.. అసలు సంగతి ఇదే!

ధన్ బాద్ జడ్జి మర్డర్ కేసు ..రాజకీయ కుట్రేనంటున్న కుటుంబ సభ్యులు..విచారణ వేగవంతం చేసిన సుప్రీంకోర్టు