Telangana Crime News: పక్కింటికే కన్నం వేసిన పోకిరి.. ఎలా చిక్కాడంటే..?

|

Jul 08, 2021 | 9:46 PM

జల్సాలకు అలవాటు పడి, మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి ఆటకట్టించారు పోలీసులు. తన పక్కింట్లోనే కన్నం వేసిన జల్సా దొంగను పట్టుకున్న...

Telangana Crime News:  పక్కింటికే కన్నం వేసిన పోకిరి.. ఎలా చిక్కాడంటే..?
Variety Thief
Follow us on

జల్సాలకు అలవాటు పడి, మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి ఆటకట్టించారు పోలీసులు. తన పక్కింట్లోనే కన్నం వేసిన జల్సా దొంగను పట్టుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…  పూడురు మండలం కడ్మూరు గ్రామానికి చెందిన గౌస్ షాపింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్ళాడు. అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడికి రాగానే అతడి సీన్ పూర్తిగా అర్థమైంది. ఇంటి తాళం, బీరువా తాళం విరగ్గొట్టి ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. తనిఖీ చేయగా బంగారం,వెండి చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో జులై రెండవ తేదిన చన్‌గోముల్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, కాల్ డేటా,టెక్నికల్ ఆధారాలతో చోరీ జరిగిన పక్కింట్లో ఉండే నాహెద్ అనే వ్యక్తి నిందితుడుగా గుర్తించారు. పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన నాహెద్.. కడ్నూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. పక్కింట్లో ఎవరూ లేకపోవడంతో దొంగతనం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నాహెద్ వద్ద నుండి 10 తులాల బంగారం, 25 తులాల వెండి రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడి తన అవసరాలకోసం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: జననేత తమ వాడే అంటున్న నాలుగు పార్టీలు.. ఇంతకీ ఆయన ఎవరికి సొంతం..?

 ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి. సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కకండి.