Cruise Drug Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ లేదు అంటున్న ఎన్సీబీ.. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం!

|

Oct 12, 2021 | 9:57 AM

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ(NCB) ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై విచారణను కోర్టు అక్టోబర్ 13 కి వాయిదా వేసింది.

Cruise Drug Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ లేదు అంటున్న ఎన్సీబీ.. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం!
Cruise Drugs Case
Follow us on

Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ(NCB) ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై విచారణను కోర్టు అక్టోబర్ 13 కి వాయిదా వేసింది. ఇక ఎన్సీబీ ఇప్పుడు తన నివేదికను కోర్టులో సమర్పించడానికి సిద్ధం చేస్తుంది. ఎన్సీబీ  ప్రతీక్ గబాను ప్రశ్నించడం కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉంది. ఇదే ఈ కేసులో అతి ముఖ్యమైన లింక్ అని చెబుతున్నారు. గతంలో కూడా ప్రతీక్‌ను దాదాపు 7 గంటల పాటు విచారించారు.

ప్రతీక్ గబాకు క్లీన్ చిట్ లేదు..

ఎన్సీబీ ఉన్నతాధికారులు ప్రతీక్ గబా విచారణలో వెల్లడించిన వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ప్రవర్తనా నియమావళి కారణంగా, మేము ఈ విషయాలు చెప్పలేమని, అన్ని విషయాలు కోర్టులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. క్రూయిజ్‌పై దాడి చేసినప్పుడు, మాదకద్రవ్యాలు తమతో లేని వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల వినియోగించని వారిని అరెస్టు చేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరూ ఏజెన్సీ విచారణ పర్యవేక్షణలో ఉన్నారు. క్రూయేజ్ లో పార్టీకి హాజరైన ఎవరికీ ఎన్సీబీ క్లీన్ చిట్ ఇవ్వలేదు.

ఈ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ లభించని విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ విషయంలో, ‘మేమిద్దరం తాగుతున్నాం, మేమిద్దరం’ అని అలాంటి కొన్ని స్టేట్‌మెంట్‌లు ఉన్నాయని అధికారులు అంటున్నారు, అంటే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆర్యన్ ప్రమేయం స్పష్టంగా ఉందని ఆ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి అని అధికారులు చెబుతున్నారు.

ప్రతీక్ గబా తన సోషల్ మీడియా ఖాతాలను మూసివేసాడు

మరోవైపు ప్రతీక్ గబా తన సోషల్ మీడియా ఖాతాలను మూసివేశారు. కొన్ని రోజులు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు, కానీ ఇప్పుడు అతని పోస్ట్ లేదా అతని బయో ఇన్‌స్టాలో కనిపించడం లేదు. ఆర్యన్ ఖాన్ ప్రతీక్ గబా ఆహ్వానం మేరకు క్రూయిజ్ పార్టీలో చేరడానికి వెళ్ళాడని చెబుతున్నారు. అందుకే ఈ కేసులో ప్రతీక్ గబా కీలకంగా మారాడు. ఆర్యన్, అంకిత్, ప్రతీక్ గబా ముగ్గురు కలిసి మన్నాట్ నుండి బయటకు వచ్చారని అంటున్నారు. అయితే, ప్రతీక్ గబాను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.

ఇదీ ఆర్యన్ డ్రగ్స్ కేసు..

షారుక్ ఖాన్ తనయుడు ముంబయి క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో పాల్గొనడంతో ఆర్యన్ తో పాటు మరో ఏడుగురిని న్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్ట్ మెమో ప్రకారం. వీరి నుంచి అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు సీజ్ చేశారు. తరువాత విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆర్యన్ తానూ చరస్ తీసుకుంటున్నట్టు అంగీకరించాడు. తనతో పాటు అతని స్నేహితులను కూడా ఈ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. తరువాత ఆర్యన్ బెయిల్ కోసం రెండుసార్లు అతని లాయర్లు ప్రయత్నించారు. కానీ,  వారికి కోర్టులో చుక్కెదురైంది.

ఇవి కూడా చదవండి:

Aryan Khan Drug Case: ఆర్యన్‌ఖాన్‌కు మరోసారి చుక్కెదురు.. బుధవారానికి వాయిదా పడిన బెయిల్‌ పిటిషన్‌..

Cruise Drug Case: షారూక్ ఖాన్ కు ఈరోజూ షాక్ తప్పదా? ఆర్యన్ బెయిల్ మార్గం ఇంకా తెరుచుకోలేదా?