Bus Catches Fire in Thane: మహారాష్ట్ర: యాత్రికుల బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయిది. మంగళవారం అర్థరాత్రి సమయంలో థానే సమీపంలో షిర్డీ యాత్రికుల బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది యాత్రికులున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయితే యాత్రికుల బస్సు ముంబై నుంచి షిర్డీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.
Also Read:
Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సురక్షితం
West Godavari District Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
Boinpally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్