Doctors Negligence: నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. కడుపులోనే గుడ్డ ముక్క ఉంచి కుట్లేసిన వైద్యులు.. స్కానింగ్‌లో బయటపడ్డ నిర్వాకం!

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సమయం ఆదమరిచిన వైద్య సిబ్బంది.. మహిళ కడుపులో దూది ఉంచి కుట్లు వేశారు.

Doctors Negligence: నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. కడుపులోనే గుడ్డ ముక్క ఉంచి కుట్లేసిన వైద్యులు.. స్కానింగ్‌లో బయటపడ్డ నిర్వాకం!
Nandyala Govt.hospital Doctors Negligence

Updated on: Jul 19, 2021 | 10:55 AM

Government Hospital Doctors Negligence: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సమయం ఆదమరిచిన వైద్య సిబ్బంది.. మహిళ కడుపులో దూది ఉంచి కుట్లు వేశారు. రెండు నెలలుగా తీవ్ర అవస్థతకు గురైన సదరు మహిళ స్కానింగ్‌లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా నంధ్యాల ప్రాంతానికి చెందిన ఓ మహిళ నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యం కోసం చేరింది. అయితే.. మహిళ కడుపు నొప్పితో బాధపడుతుందని డాక్టర్లు సిజేరియన్ చేసారు. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్య సిబ్బంది.. కోలుకున్నందంటూ ఇంటికి పంపించేశారు. అయితే, రెండు నెలలుగా కడుపులో నొప్పి తగ్గకపోగా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో మరోసారి ఆమెను అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించారు. దీంతో సిజేరియన్ చేసే సమయంలో మహిళ కడుపులో గుడ్డ ముక్కను మరచి కుట్లు వైద్యులు వేసారని గుర్తించారు.

ఆ మహిళకు మళ్లీ నొప్పి రావడంతో మరో చోట స్కానింగ్ చేయించడంతో మహిళ కడుపులో గుడ్డ ముక్క ఉన్నట్లు తేలింది. దీంతో మహిళ వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసి గుడ్డ ముక్కను తొలగించారు. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం వల్లే ఇలా జరిగిందని బాధితురాలి బంధువులు ప్రభుత్వాస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also…  Heart Problem: యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. ఈ పద్దతులు మార్చుకుంటే సులువుగా బయటపడొచ్చు..