Nampally Court Judgement : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిపై అఘాయిత్యం కేసులో 20 యేండ్ల జైలు, 2 వేల ఫెనాల్టీ..

|

Jan 06, 2021 | 9:08 PM

Nampally Court Judgement : అభం శుభం తెలియని పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చ‌ట్టం

Nampally Court Judgement : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిపై అఘాయిత్యం కేసులో 20 యేండ్ల జైలు, 2 వేల ఫెనాల్టీ..
Follow us on

Nampally Court Judgement: అభం శుభం తెలియని పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చ‌ట్టం కింద 20 యేండ్ల జైలు, రూ. 2 వేల ఫెనాల్టీ విధించి సంచలన తీర్పును ప్రకటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 లో అబిడ్స్‌లోని ఓ ప్రై‌వేట్ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠ‌శాల‌లో సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తున్న అల‌హాబాద్‌కు చెందిన క‌మ‌ల్ బాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయ స్థానం ముందు హాజ‌రుప‌ర్చారు. అప్పటినుంచి కోర్టులో కేసు న‌డుస్తుండ‌గా పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు న్యాయ‌స్థానం ముందు స‌మ‌ర్పించారు. కేసు పూర్వా ప‌రాలు విచారించిన నాంప‌ల్లి పోక్సో కేసెస్ మెట్రోపాలిట‌న్ సెష‌న్స్ కోర్టు స్పెష‌ల్ జ‌డ్జి ప్రేమ‌ల‌త నిందితుడికి 20 యేండ్ల జైలు, రూ 2 వేలు ఫెనాల్టీ విధిస్తూ తీర్పునిచ్చారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన శిక్షను విధించారు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మ‌హిళ‌ల‌పై మ‌హారాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..‌ దిశ చ‌ట్టం త‌ర‌హాలో అసెంబ్లీలో శ‌క్తి బిల్లు