2 లక్షల 50 వేలకు బేరం, భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు కిడ్నాప్, హత్య కేసులో వీడిన మిస్టరీ

|

Feb 17, 2021 | 1:44 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు కిడ్నాప్, హత్య కేసు కొలిక్కి వచ్చింది. హతుడు కోదండరామారావుకు, కాళ్ళ మండలం..

2 లక్షల 50 వేలకు బేరం, భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు కిడ్నాప్, హత్య కేసులో వీడిన మిస్టరీ
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు కిడ్నాప్, హత్య కేసు కొలిక్కి వచ్చింది. హతుడు కోదండరామారావుకు, కాళ్ళ మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామికి మధ్య ఆర్థిక విభేదాలే కిడ్నాప్, హత్యకు దారితీశాయని పోలీసులు నిగ్గు తేల్చారు. కిడ్నాప్ చేసేందుకు రాజమండ్రికి చెందిన నలుగురు పాత నేరస్తులతో వీరాస్వామి సుపారీ మాట్లాడుకున్నట్టు తేలింది. రౌడీషీటర్ ఆవుల కొండ నేతృత్వంలో ఈ కిడ్నాప్, హత్య ప్రణాళిక సాగినట్టు సమాచారం. ఆవుల కొండకు జైల్లో పరిచయం అయిన రాజమండ్రికి చెందిన పాత నేరస్తులతో ఈ హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్ కు 2 లక్షల 50 వేలకు సుపారీ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే, కారులో కిడ్నాప్ చేసి బాగా కొట్టడంతో కోదండరామారావు చనిపోయినట్టు భావిస్తున్నారు.

Read also : ప్రకాశంజిల్లా తలమళ్ల దగ్గర బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి