ప్రకాశంజిల్లా తలమళ్ల దగ్గర బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ళ దగ్గర బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు..
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ళ దగ్గర బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒంగోలులో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, సొంత గ్రామం అయిన హనుమంతునిపాడు మండలం వాలిచర్లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కార్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాలంటీర్ నాగరాజుతో సహా, అతని తల్లి, వదిన స్పాట్ లోనే ప్రాణాలొదిలారు. మృతులను నాగరాజు (30), తల్లి కొక్కెర పొలమ్మ (55), వదిన మల్లేశ్వరి (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also : AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 10.30 గంటలకు 40.29 శాతం పోలింగ్