Murder News: కృష్ణా జిల్లాలో దారుణం.. కంటి ఆస్పత్రిలో హత్య.. కిరాతకంగా కోడికత్తితో పొడిచి..
కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటుచేసుకుంది. రోటరీ కంటి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకున్న ప్రభాకరరావు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
Murder News: కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటుచేసుకుంది. రోటరీ కంటి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకున్న ప్రభాకరరావు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రభాకరరావును రమేష్ అనే వ్యక్తి కోడికొత్తితో పొడిచి హతమార్చాడు. వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రభాకరరావు హత్యకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: