Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలో అంతుపట్టని వైరల్ ఫీవర్ కారణంగా.. 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది చనిపోవడంతో.. జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారీ సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి యోగి.. ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక వార్డును కేటాయించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు.
మధుర, ఫిరోజాబాద్, మెయిన్‌పురితో సహా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో ‘వైరల్ ఫీవర్’ కేసులు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలతో పాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన పెరిగింది. ఫిరోజాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మనీష్ అసిజా గత వారం రోజుల్లో 40 మంది పిల్లలు అంతుచిక్కని వ్యాధి కారణంగా మరణించాలని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ ఖండించారు. అసిజా ప్రకటన పూర్తిగా తప్పు అని, అలాంటి సమాచారం ఏదీ తమకు అందలేదని చెప్పుకొచ్చారు.
ఇదే అంశంపై ఫిరోజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ కూడా స్పందించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా చనిపోయారంటూ వస్తున్న వదంతులను ఖండించారు. ‘‘భారీ వర్షాలు, మురుగు నీటి కారణంగా పిల్లలు వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భారిన పడ్డారు. ఈ వ్యాధుల కారణంగానే పిల్లలు చనిపోయారు.’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పిల్లలందరికీ కరోనా పరీక్షలు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.
Also read:
Supreme Court: మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..
Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి తాలిబన్ల ఘాతుకం.. 14 మంది హజారా వర్గం ప్రజల ఊచకోత..