Mysterious Blast : క‌ర్ణాట‌క‌ శివ‌మొగ్గ‌లో భారీ పేలుడు.. 8 మందికి పైగా మృతి..జిలటిన్ స్టిక్కులు తీసుకెళ్తుండగా ఘటన

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. అబ్బ‌ల‌గిరె గ్రామ స‌మీపంలో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో 8 మందికి పైగా మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

Mysterious Blast : క‌ర్ణాట‌క‌ శివ‌మొగ్గ‌లో భారీ పేలుడు.. 8 మందికి పైగా మృతి..జిలటిన్ స్టిక్కులు తీసుకెళ్తుండగా ఘటన

Updated on: Jan 22, 2021 | 6:40 AM

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. అబ్బ‌ల‌గిరె గ్రామ స‌మీపంలో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో 8 మందికి పైగా మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్వారీలో ఉప‌యోగించే పేలుడు ప‌దార్థాల‌ను త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో వాహ‌నం పూర్తిగా తగలబడింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రాత్రి కావ‌డంతో ఎంత మంది చ‌నిపోయార‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త లేద‌ని పోలీసులు తెలిపారు.