Crime News: 22 ఏళ్ల క్రితం ఇంట్లో చోరీ.. విలువైన బంగారం మాయం.. ఇన్నాళ్లకు మళ్లీ దొరికింది! దాదాపు 8 కోట్ల విలువ..

|

Feb 01, 2022 | 10:56 AM

ఈ రోజుల్లో దొంగతనాలు కూడా సర్వసాధారణమైపోయింది. ఐతే దొంగించబడిన వస్తువులు దొరకడం మాత్రం అసాధారణమే. అదీ నిన్న, మొన్న జరిగిన దొంగతనం కాదు. ఏకంగా 22 ఏళ్ల క్రితం ఓ ఇంట్లో దొంగలు పడి బంగారంతోపాటు, విలువైన వస్తువులను..

Crime News: 22 ఏళ్ల క్రితం ఇంట్లో చోరీ.. విలువైన బంగారం మాయం.. ఇన్నాళ్లకు మళ్లీ దొరికింది! దాదాపు 8 కోట్ల విలువ..
Stolen Gold
Follow us on

Mumbai crime news: ఈ రోజుల్లో దొంగతనాలు కూడా సర్వసాధారణమైపోయింది. ఐతే దొంగించబడిన వస్తువులు దొరకడం మాత్రం అసాధారణమే. అదీ నిన్న, మొన్న జరిగిన దొంగతనం కాదు. ఏకంగా 22 ఏళ్ల క్రితం ఓ ఇంట్లో దొంగలు పడి బంగారంతోపాటు, విలువైన వస్తువులను లన్నింటినీ దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇక సొత్తు దొరకదులే అని ఆశలు వదిలేసుకుంటున్నసమయంలో అనుకోకుండా నాడు పోగొట్టుకున్న వస్తువులన్నీ తిరిగి పొందగలిగింది ఈ కుంటుంబం. ఎలా జరిగిందంటే.. ముంబైలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. కోలాబాలో నివసించే అర్జున్ దాస్వానీ ఇంట్లో 1998, మే 8న (22 ఏళ్ల క్రితం)లో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు యజమానిని, అతని భార్యను బంధించి, బంగారు ఆభరణాలు, పాత బంగారు నాణేలను అపహరించారు. అప్పట్లో వాటి విలువ దాదాపు రూ.13 లక్షలు కాగా, ఇప్పుడు దాదాపు రూ.8 కోట్ల విలువ ఉంటుంది. అప్పటి యజమాని అర్జన్ దాస్వానీ 2007 సంవత్సరంలో మరణించాడు.

ఆ తర్వాత బంగారం చోరీ కేసును కుటుంబం దాదాపు మరచిపోయింది. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు 1998లో అరెస్టు చేయగా, ఇద్దరు తప్పించుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుకునే వరకు చోరీకి గురైన వస్తువులను యజమానులకు అప్పగించరాదని కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఐతే చోరీకి గురైన బంగారాన్ని యజమానులకు అప్పగించేందుకు గత ఏడాది ముంబై పోలీసులకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలమేరకు బంగారాన్ని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ చిరాగ్ దిన్ యజమానికి పోలీసులు వాపస్ చేశారు.

ఈ కేసు గురించి ముంబై ఏసీపీ పాండురంగ్ షిండే మాట్లాడుతూ.. బంగారం 2002 నుంచి పోలీసుల వద్ద ఉంది. చోరీకి గురైన బంగారాన్ని వాటి యజమానులకు తిరిగి ఇచ్చేయాలని గత ఏడాది పోలీసు కమీషనర్ మమ్మల్ని కోరారు. ఈ విషయమై మేము బంగారం యజమాని సహాయంతో కోర్టులో దరఖాస్తు చేశాం. ఆ తర్వాత కోర్టు అనుమతి మంజూరు చేసి బంగారాన్నియజమానికి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించిందని మీడియాకు తెలియజేశారు. ఇక దాస్వానీ కుటుంబం పోయిన బంగారం తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేశారు. బంగారం ధర కోట్లలో ఉండటంతో పాటు తమ పూర్వీకుల వారసత్వాన్ని కూడా తిరిగి పొందగలిగామన్నారు.

Also Read:

Wooden Chair: రూ.500లకు చెక్క కుర్చీని కొని.. ఏకంగా 16 లక్షలకు అమ్మేసింది.. సీక్రేట్ అదే!