Fake Vaccination Camp: కలకలం రేపుతున్న ఫేక్ వ్యాక్సినేషన్.. 2 వేల మందికి ఉప్పు నీటి వ్యాక్సిన్లు..!

|

Jun 26, 2021 | 5:13 AM

Fake Covid-19 Vaccination: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్‌‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నకిలీ వ్యాక్సినేషన్ల బాధితులు దాదాపు రెండువేల మంది

Fake Vaccination Camp: కలకలం రేపుతున్న ఫేక్ వ్యాక్సినేషన్.. 2 వేల మందికి ఉప్పు నీటి వ్యాక్సిన్లు..!
Covid-19 Vaccine
Follow us on

Fake Covid-19 Vaccination: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్‌‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నకిలీ వ్యాక్సినేషన్ల బాధితులు దాదాపు రెండువేల మంది ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్యాంపులపై ఇప్పటికే ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్‌ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే.. వీటి పరీక్షల అనంతరం తెలుస్తుందని జాయింట్ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్‌)విశ్వస్ నంగ్రే పాటిల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు గుర్తించామన్నారు. ఆ క్యాంపులను ఈ ఎనిమిది మంది సభ్యుల ముఠానే నిర్వహించిందన్నారు.

వారందరినీ అరెస్టు చేశామని.. వారి వద్ద నుంచి రూ.12.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితులైన మనీష్ త్రిపాఠి, మహేంద్రసింగ్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినట్లు పాటిల్ తెలిపారు. టీకాలు ఇచ్చేందుకు ముఠా వినియోగించిన కొవిషీల్డ్‌ వయల్స్‌ను గుజరాత్‌ నుంచి సేకరించారని.. వాస్తవంగా వాటిలో ఏమి నింపారో స్పష్టంగా చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. ముంబయిలోని కాందీవాలిలోని ఓ హౌసింగ్ సొసైటీలో గత వారం 390 మందికి టీకాలు వేశారు. కాగా టీకా తీసుకున్న తర్వాత వారెవరికీ.. మెస్సెజ్‌లు కానీ.. లక్షణాలు కాని కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన హౌసింగ్ సొసైటీ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే.. ఈ నకిలీ ముఠా ముంబయిలోని మరో ఎనిమిది ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ క్యాంప్‌లు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. మలాద్, కాందీవలి, బొరీవలి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించారు. దీనిపై ముంబై కోర్టులో 29న విచారణ జరగనుంది.

Also Read:

Florida Building Collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 12 అంతస్థుల భవనం.. 159 మంది ఆచూకీ గల్లంతు

Security fires Bank Customer: దారుణం..మాస్క్ వేసుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు